ఎలా వేయాలి : 👈
- మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు మరియు ఫొటోస్ ఉంటాయి.
- మీరు మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి 1 నంబర్ వేయాలి.
- పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి.
- వెళ్ళేటపుడు మీ ఐడీ ప్రూఫ్ లు తీసుకొని వెళ్ళాలి…. ఎలక్షన్ కమిషన్ నిర్ణయించే ప్రూఫ్స్.
- బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి.
- బూత్ బయట ఓటర్ లిస్టు లో మీ పేరు మరియు క్రమ సంఖ్య చూసుకోండి.
ఎలా వేయకూడదు : 👈👈
- మీ సొంత పెన్ వాడకూడదు.
- అభ్యర్థుల అందరికి ఒకటే నంబర్ ఇవ్వకూడదు.
- ఒకటి అని రాయకూడదు. ఇంగ్లీష్ లో కూడా one అని రాయకూడదు
- బ్యాలెట్ పేపర్ లో ఎక్కువ పేర్లు ఉంటాయి…. ఆ పేర్ల లో మీకు నచ్చిన వారికి 1 వ నంబర్ వెయ్యాలి.
- బ్యాలేట్ పేపర్ వారు చెప్పే పద్ధతులలో ఫోల్డ్ చేసి వేయక పోతే ఇన్వాలిడ్ గా తీసుకుంటారు.
- కాళిగా పేపర్ వేయరాదు.
- మీరు ఇచ్చే నంబర్స్ గట్టిగా పెన్ తో దుద్దరాధు.
- అభ్యర్ధి పేరు మరియు బాక్స్ ప్రక్కన కాకుండా మరే ఇతర ప్రదేశాలలో వేసినా ఓట్ చెల్లదు.
- 1 వేయకుండా మిగతా నంబర్స్ వేస్తే ఓట్ చెల్లదు
- అభ్యర్థులు ఎక్కువ ఉంటే అందరికి వేయవలిసిన అవసరం లేదు.ఉదా: 70 మంది ఉంటే అందరికీ అవసరం లేదు…ఒక వ్యక్తికి వేస్తే చాలు.
👉 మొదటసారి ఓట్ హక్కు వినియోగించికునే వారు ఈ నియమాలు పాటించాలి.