కురిచేడు మండలంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగా కురిచేడు నుండి ఎన్ఎస్పి అగ్రహారం వెళ్లే దారిలో గల చింత చెట్టు వాగు పొంగి ఉదృతంగా ప్రవహిస్తుంది. ఒక్కసారిగా వాగు పొంగిపొర్లడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పైనుండి వస్తున్న నీటి ప్రవాహంతో వాగు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా పొంగిన వాగును చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
