ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధానికి మోడీ ప్రభుత్వ మద్దతు సిగ్గు చేటు ….యుద్ధం ఆపాలి శాంతిని కాపాడాలి –

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

గత 28 రోజులుగా పాలస్తీనా పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం అమానుషంగా సాగుతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు అన్నారు. యుద్ధం ఆపాలి, శాంతిని నెలకొల్పాలని ఈరోజు దరిశి గడియార స్తంభం సెంటర్లో సిపిఎం నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ….. అమెరికా అండతో పాలస్తీనా పై ఇజ్రాయిల్ అమానుషమైన హత్యాకాండ సాగిస్తున్నదని అన్నారు. యుద్ధ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై భద్రతా మండలి లో జరిగిన సమావేశాలకు మోడీ హాజరు కాకపోవడం విచారకరమని అన్నారు. అమెరికా అడుగులకు మడుగులోత్తుతు, భారత దేశ సాంప్రదాయానికి భిన్నంగా ఇజ్రాయలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికే ఈ యుద్ధంలో 9000 మందికి పైగా మరణించారని, వారిలో 3600 మంది చిన్నారులు ఉన్నారని అన్నారు. ఇటీవల ఒక హాస్పటల్ మీద ఇజ్రాయిల్ బాంబు దాడి చేయగా అందులో చికిత్స పొందుతున్న 500 మంది క్షతగాత్రులు, 116 మంది వైద్యులు, 200 మంది వైద్య సిబ్బంది మృతి చెందారని చెప్పారు. ఇప్పటికే 35 మంది మీడియా ప్రతినిధులు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అనేకమంది మరణించడం విచారకరమని అన్నారు. అంతర్జాతీయ యుద్ధ నిబంధనలకు, మానవ హక్కులు భిన్నంగా సాగుతున్న ఆసుపత్రుల మీద, శరణార్థ శిబిరాల మీద, సహాయ కార్యక్రమాలలో వున్న వారి మీద దాడులు జరపటం ఘోరమని, ఈ దారుణాలను ఖండించాలన్నారు. హమాస్ ని అంతముందించటం అనే లక్ష్యంగా ఇజ్రాయిల్ చేస్తున్న ఈ యుద్ధం పాలస్తీనాను తునాతునకలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట బ్రిటన్, తర్వాత అమెరికన్ సామ్రాజ్యవాదులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ఇజ్రాయల్ ను పావుగా చేసుకుని ఈ హత్యాకాండ కు పాల్పడుతున్నారని అన్నారు. అమెరికాకు నిత్యం యుద్ధాలు కావాలని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం, యుద్ధ సామాగ్రి, ఆయుధాల అమ్మకాల కోసం ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. యుద్ధం ఆపాలని శాంతి నెలకోలపాలని ఐక్యరాజ్యసమితి చెప్పినా, అమెరికా అండతో ఇజ్రాయిల్ పెట్రేగి పోతున్నదని అన్నారు. . మానవతావాదులు, ప్రజాతంత్ర వాదులందరూ వీధుల్లోకి రావాలని,యుద్ధాన్ని నివారించే విధంగా, శాంతియుత కార్యక్రమాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సిపిఎం దరిశి నియోజక వర్గ కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ
మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని చూపి మన దేశంలో కూడా మత ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నదని అన్నారు. కేరళలో బాంబు పేలుళ్లకు హమాస్ కారణమని, ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కేంద్ర మంత్రి చేయటం అందులో భాగమేనని అన్నారు.

 ఈ కార్యక్రమం లో సిఐటియు , DYFI , రైతు సంఘం నాయకులు గోగు వెంకయ్య, కెవి పిచ్చయ్య , యస్. వెంకటేశ్వరరావు, టి. రంగనాయకులు, ఉప్పు నారాయణ , షేక్ కాలే భాషా , నాగరాజు ,   ch. ఆదినారాయణ, జాన్, పి. పుల్లయ్య, టి లక్ష్మీ, పద్మ, యస్. రంగమ్మ, కోటేశ్వరరావు , వెంకట స్వామి , కొండయ్య పాల్గొన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *