కార్మికులకు పోరాటాలే రక్షణదరిశిలో ఘనంగా మేడేసిఐటియు దరిశి నియోజక వర్గ కార్యదర్శి తాండవ రంగారావు

కార్మికులు పోరాటాలు చేయడమే వలనే 8 గంటల పని విధానం అమలు లోకి వచ్చిందని సిఐటియు దరిశి నియోజక వర్గ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు . 138వ మేడే సందర్భంగా ఈరోజు దరిశి సుందరయ్య భవనం పై గడియారం స్థంభం సెంటర్, ఆటో వర్కర్స్ , స్వచ్ఛ భారత్ పారిశుధ్య కార్మికులు , సిఐటియు , సిపియం జెండాలను 6 ప్రాంతాలలో ఉప్పు నారాయణ , గోగు వెంకయ్య , షేక్ భాషా , ఆలూరి ఇస్సాయిల్ , ఈమని నాగేశ్వరరావు , ఆవిష్కరణలు చేశారు.*

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రంగారావు మాట్లాడుతూ అమెరికా లోని చికాగో నగరంలోని హే మార్కెట్ వద్ద 1886 లో కార్మికులు 15 గంటల పనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని , ప్రభుత్వం , పెట్టుబడి దారులు కలసి తుపాకులతో కాల్పులు జరపగా 7 గురు అమరులైయ్యారని , 4గురిపై కేసులు పెట్టి ఉరిశిక్షలు వేశారని , దానికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా ప్రపంచం లోని అన్ని దేశాలలో తిరుబాటు సమ్మెలు చేశారని 1917 లో రష్యలో లెనిన్ నాయకత్వాన కార్మికులు విప్లవం ద్వారా సోషలిజం సాధించడంతో 8 గంటల పని విధానం అమలు చేసిందని కార్మికుల పోరాటాల వలనే PF , ESI , శెలవులు , ఫించను పధకం లాంటి హక్కులు వచ్చాయని ఆయన తెలిపారు. ఆ హక్కుల కోసమే మేడే ని ప్రపంచ వ్యాప్తంగా మతాలు , కులాలు , ప్రాంతాలు భేధం లేకుండా ప్రపంచం మెత్తం మేడే జరుపుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కె‌.వి పిచ్చయ్య , కోటేశ్వరరావు , గర్నిపూడి జాన్ , రామ్ కోటిరెడ్డి , కాలే భాషా , సుబ్బారెడ్డి , అంజనేయులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *