కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆటో డ్రైవర్లను సన్మానించుకోవడం సంతోషంగా వుంది ….నార్త్ జోన్ ట్రాఫిక్ ఏ సి పి శంకర్ రాజు.
కార్మిక దినోత్సవం (మేడే)రోజున ఆటో డ్రైవర్లను సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా వుందని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏ సి పి జి శంకర్ రాజు అన్నారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో
ఆటో డ్రైవర్సను ట్రాఫిక్ ఏ సి పి శంకర్ రాజు, గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ ఇన్స్ పెక్టర్ మరియు సిబ్బంది సన్మానించారు. ఈ సందర్భంగా వారికి ట్రాఫిక్ నిబందనలపైన పలు సూచనలు సలహాలు ఇచ్చారు.ఆటో లలో ఓవర్ లోడ్ తో ప్రయాణించవద్దని.పరిమితికి లోబడి మాత్రమే ప్రయాణీకులను ఎక్కించుకోవాలని.డ్రైవర్ కి పక్క సీట్ లో ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణీకులను ఎక్కించు కోవద్దని,ఆటో నడుపుతున్న సమయం లో మొబైల్ చూడ వద్దని,ప్రయాణీకులను సురక్షితంగా వారి గమ్యానికి చేర్చాలని ఏ సి పి వారికి సూచించారు


