ఓటింగ్ కోసం 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపవచ్చు: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్

13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటపుడు ఎపిక్ కార్డు లేని వారు 13 రకాల కార్డులలో ఏదైనా ఒక దానిని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

1) ఓటర్ గుర్తింపు కార్డు
2) ఆధార్ కార్డు
3) ఎం.ఎన్.ఆర్.ఇ. జి.ఏ.జాబ్ కార్డు
4) ఫోటోతో ఉన్న బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్
5) కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
6) డ్రైవింగ్ లైసెన్స్
7) పాన్ కార్డ్
8) కార్మిక మంత్రిత్వ శాఖ పథకం ద్వారా జారీచేసిన స్మార్ట్ కార్డు
9) పాస్పోర్ట్
10) ఫోటో తో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్
11) కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు
12) ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు
13) యూనిక్ డిసెబిలిటీ గుర్తింపు కార్డు

 పైన వివరించిన 13) గుర్తింపు కార్డులలో  ఏదైనా ఒకదానిని చూపించి ఓటు వేయవచ్చని ఆయన సూచించారు. ఈనెల 13న జిల్లాలోని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డి ఈ ఓ కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *