సామాన్య రైతులు అంతర్జాతీయ అ వకాశాలను అందిపుచ్చుకోవ చ్చునన్న అంశాన్ని స్థానిక వ్యవ సాయాధికారి బి.ప్రసాదరావు ప్రయోగాత్మకంగా వివరించి ప లువురు శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకున్నారు. ఆశాఖ ఉన్నతా ధికారుల చేతులమీదుగా ఉత్త మ శిక్షణకుడిగా సర్టిఫికెట్ అం దున్నారు. హైదరాబాద్లో ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డివలప్మెంట్, పంచాయతీరాజ్ నిర్వహించిన ఇంప్లిమెంటింగ్ గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, ప్రాసెస్ అండ్ ప్రొటోకాల్ ఫర్ సర్టిఫికెషన్ ఆధ్వర్యంలో జరి గిన జాతీయస్థాయి శిక్షణలో ఏవో బి.ప్రసాదరావు నాణ్యమైన పంటల సాగు, దిగుబడి గురించి వివరించారు. సెమినార్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా మన ఉత్పత్తులు, రసాయన రహితంగా చేపట్టాల్సిన సాగు, తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ఆశాఖ డైరెక్టర్లు నిత్య వి.జి, సూర్జిత్ విక్రమన్, డైరెక్టర్ జనరల్ నరేంద్రకుమార్ చేతుల మీదుగా ఏవో సర్టిఫికెట్ అందుకున్నారు.

