తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్
హైస్కూల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. శుక్రవారం ఏడు, ఎనిమిది తరగతి గదలుకు చెందిన వరండా శాబ్ పెచ్చుకలు ఊడి ప డ్డాయి. హైస్కూలు ముగిసిన తరువాత సాయంత్రం వేళ విద్యార్థులు లేని సమయంలో వరండా శ్లాబ్ కూలడంతో ప్రమాదం తప్పింది. బొద్దికూర పాడు జడ్పీ హైస్కూల్లో పూర్వపు రేకులషెడ్ తరగతి గదులకు 20ఏళ్ల కిత్రం శ్లాబ్ వేశారు. ఆ గదులకు పిల్లర్స్ లేకపోవటంతో రెండు తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిస్థానంలో నూతన భవనాలు నిర్మాణాలు చేపట్టినా పనులు అసంపూ ర్తిగా ఉన్నాయి. తరగతుల నిర్వహణకు అనువుగా లేక పోవటంతో గత్యంతరం లేక శివంభవనాల్లోనే కొనసాగు తున్నాయి.
వేసవి సెలవులు ముగి సేవా అసంపూర్తిగా ఉన్న భవనాల పనులను అధికారు. లు పూర్తి చేయలేదు. ఈనెల 13 నుంచి పాఠశాలలు ప్రా రంభమయ్యాయి, తరగతి గదుల్లోని పెచ్చుకలు ఊడే పడుతూ ప్రమాదకంగా ఉన్నా ప్రత్యామ్నాయం లేకఆ గదుల్లోనే క్లాసులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంభయంగా గడుపుతున్నారు. ఆ గదుల శ్లాబ్ పెచ్చుకలు ఊడి పడి ఇనుప మువ్వలు బయటపడ్డాయి. ఆ గదుల్లో క్లాసులు నిర్వహిస్తే ఏదైనా అనుకోని సంఘటన జరిగే ప్రసూదముందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
అసంహర్తి పనులతో మిగిలిన తరగతి గదులకు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాల్సి ఉంది. అధికారయంత్రాంగం మీనమేషాలు లెక్కించకుండా తరగతి గదుల పనులను పూర్తి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నాడు. అలాకాండా శిథిలావస్థకు చేరిన గదుల్లోనే క్లాసులు నిర్వ హిస్తే భవిస్యత్తుల్లో ఏదైనా జరగరాని సంఘటన ఒరిగితే అధికారులే భాధ్యత వహించాల్సి ఉంటుందని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.

