వైసిపికి మాజీ మంత్రి శిద్దా రాజీనామా

రాష్ట్ర మాజీ మంత్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాను ప్రటించారు. నా వ్యక్తిగత కారణాల రీత్యా వైఎస్ఆర్సిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల తర్వాత టిడిపి నుండి వైసీపీలోకి చేరిన మాజీ మంత్రి,. దర్శి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఆశించారు. దక్కకపోవడంతో అద్దంకి , మార్కాపురం తో పాటు పలుచోట్ల పోటీ చేయాలని అధిష్టానం సూచించిన అందుకు అంగీకరించలేదు. అయితే ఆయన సేవలను దర్శిలో మాత్రం ఉపయోగించుకోలేదు. ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేయడంతో త్వరలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని దర్శి ప్రజలతోపాటు, ప్రకాశం జిల్లాలో కూడా చర్చనీయాంశంగా మారింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *