కేంద్ర మంత్రులుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన గంగాపురం కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ లకు సెల్యూట్ తెలంగాణ పేరుతో బీ జె పీ శ్రేణులు స్వాగత ర్యాలీని ఏర్పాటు చేశారు ఈ ర్యాలీ గురువారం సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం భారీ కార్యకర్తల ర్యాలీ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయం వరకు సాగింది. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి న కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అయిదు గంటల 28 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కిషన్ రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్, ఎంపీ రాజ్యసభ డాక్టర్ కే లక్ష్మణ్, ప్రేమేందర్, కాశం వెంకటేశ్వర్లు, చింతల్ రామచంద్రారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు బిజెపి నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు రోజుల క్రితం బండి సంజయ్ కుమార్ హైదరాబాదుకు వచ్చారు. కాసేపటి క్రితం కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్ కిషన్ రెడ్డిలకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిసారి రాష్ట్రానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ ను బుధవారం పార్టీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. మొదటిసారిగా రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర మంత్రులకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు కేంద్ర మంత్రులు రాక సందర్భంగా బుధవారం రోజున బేగంపేట విమానాశ్రయం తో పాటు ర్యాలీ జరుగుతున్న ప్రాంతాల్లో వారికి స్వాగతం పలుకుతూ నాయకులు భారీ కటౌట్లు , బ్యానర్లు ఏర్పాటు చేశారు .ఎవరికి తోచిన విధంగా వారు బ్యానర్లు ఏర్పాటు చేయడంతో నగరంలోని అన్ని ప్రాంతాలు కాషాయమయంగా మారిపోయాయి .
ర్యాలీ సాగిందిలా…..
బేగంపేట విమానాశ్రయం వద్ద ఆరు గంటల మూడు నిమిషాలకు ప్రారంభమైన సెల్యూట్ తెలంగాణ ర్యాలీ బిజెపి కార్యాలయం వరకు సాగింది . ఈ ర్యాలీ బేగంపేట విమానాశ్రయం నుంచి మొదలై రసూల్పురా క్రాస్ రోడ్స్ పారడైజ్ సర్కిల్ రాణిగంజ్ సైలెంట్ క్లబ్ మర్రి టోటల్ కవాడిగూడ క్రాస్ రోడ్స్ ముషీరాబాద్ క్రాస్ రోడ్స్ గోల్కొండ క్రాస్ రోడ్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నారాయణగూడ ఫ్లైఓవర్ వైఎంసిఏ హిమాయత్ నగర్ క్రాస్ రోడ్స్ ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్టర్స్ క్రాస్ రోడ్స్ బషీర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం అబిడ్స్ సర్కిల్ నాంపల్లి రైల్వే స్టేషన్ నాంపల్లి క్రాస్ రోడ్స్ మీదుగా బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంది.
ర్యాలీలో పాల్గొన్న నేతలు బేగంపేట విమానాశ్రయం వద్ద ప్రారంభమైన సెల్యూట్ తెలంగాణ ర్యాలీలో కేంద్ర మంత్రులు గంగాపురం కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ తో పాటు బిజెపి ఎంపీలు ఈటెల రాజేందర్ ,కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి నాగేష్, డాక్టర్ కే లక్ష్మణ్ ఎంపీ రాజ్యసభ పాల్గొన్నారు వీరితో పాటు ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్ ,ధన్పాల్ సూర్యనారాయణ ,పాయల్ శంకర్ ,ఆలేటి మహేశ్వర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, కె వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
ట్రాఫిక్ దిగ్బంధనంలో నగరం…..
కేంద్ర మంత్రులకు స్వాగతం పలుకుతూ బిజెపి నాయకులు క్యాడర్ ఏర్పాటు చేసిన సెల్యూట్ తెలంగాణ ర్యాలీ సందర్భంగా నగరం లోని పలు ప్రాంతాలు ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కుకున్నాయి.దీంతో వాహనదారులు చాలాసేపు ఇబ్బంది పడ్డారు ర్యాలీ నిర్వహించిన సమయం సాయంత్రం కావడం,ఇతర ప్రాంతాల నుంచి కార్యాలయాలకు వెళ్లి ఇంటికి తిరిగి వెల్తున్న ఉద్యోగులు, పనులపై బయటకు వచ్చిన వారు ఇళ్లకు వెళుతున్న సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
బేగంపేట కంటెస్ట్ ద్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆనంద్,నెమలి ఆనంద్ (నందు) ఆధ్వర్యం లో విమానాశ్రయానికి తరలి వెళ్ళిన బీ జె పీ నేతలు….
బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు బేగంపేట బిజెపి కంటెస్టెఢ్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆనంద్ బిజెపి సీనియర్ నాయకులు ఆనంద్ (నందు) ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున బిజెపి శ్రేణులు బేగంపేట విమానాశ్రయానికి తరలి వెళ్లాయి. కేంద్ర మంత్రులకు స్వాగతం పలుకుతూ నెమలి ఆనంద్ రాజ్యలక్ష్మి లు బేగంపేట బేగంపేట ప్రారంభం నుంచి ర్యాలీ సాగే మార్గంలో నాయకులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. విమానాశ్రయానికి తరలిన వారిలో రాజ్యలక్ష్మి ఆనంద్ ,నెమలి ఆనంద్ ,సురేష్ రావెల్ ,సందీప్ వర్మ ,బీరం నర్సింగరావు ,గోవింద్, మైసూర్ మధుసూదన్, తారకంపేట శ్రావణ్ ,రెడ్డి అనిల్ ,శైలేందర్, సతీష్ ,సురేష్ ,శరత్ కుమార్ ప్రశాంత్ తదితరులు ఉన్నారు.



