ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. బేగంపేట్ టిటిఐ ఎసిపి జి. శంకర్ రాజు……………

ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని బేగంపేట్ టి టి ఐ ఏసిపి జి శంకర్ రాజు అన్నారు. బేగంపేట కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో సిబ్బందికి రోడ్డు ప్రమాదాలు నివారణ అనే అంశంపై నిలిసిపి అవగాహన కలిగించారు ఈ సందర్భంగా శంకర్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వాహనాలతో రోడ్లపైకి వచ్చినప్పుడు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే 5000 పెనాల్టీతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందన్నారు. ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అలాగే కార్లు ఇతర ఇతర వాహన దారులు సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు. సిగ్నల్స్ విధిగా పాటించాలన్నారు. వర్షాకాలంలో రోడ్లు జారిపోయే ప్రమాదం ఉందని వాహనాలు నియమిత వేగంతో ప్రయాణించాలని ఆయన సూచించారు. ఎవరైనా కార్యక్రమంలో దీపక్ సెక్యూరిటీ ఆఫీసర్ త్రిపాటి కుమారస్వామి గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రజల ప్రాణాలను నిలబెట్టే దేవుళ్ళు డాక్టర్లు……..

ప్రమాదాల బారిన పడి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి వచ్చేవారిని వైద్యం చేసి రక్షించేది , వారికి తిరిగి ప్రాణం పోసేది వైద్యులేనని బేగంపేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏసిపి జీ. శంకర్ రాజు అన్నారు. ప్రజల ప్రాణాలను నిలబడుతున్న వైద్యులే నిజమైన హీరోలని ఆయన అన్నారు. వారితో సమానంగా ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించే వైద్య సిబ్బంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలపై ప్రయాణిస్తున్న సమయంలో తప్పక ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. 2023 సంవత్సరం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 65 వేల 413 2022లో 42వేల 251 సిగ్నల్ జంపింగ్ కేసులు నమోదయాయని ఆయన తెలిపారు. 2023 సంవత్సరంలో 6173 మంది 2024 సంవత్సరంలో 3300 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి టిటిఐ బేగంపేట్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *