తాళ్లూరు మండలంలోని నాగం బొట్లపాలెం పంచాయతీ కార్యదర్శిగా పనిచే స్తున్న పురం నరేంద్ర(42) అనారోగ్యంతో బాధ పడుతూ గురువారం మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భౌతికకాయానికి ఎంపీడీఓ కార్యాలయం ఏఓ వజ్జ శ్రీనివాసరావు, సర్పంచ్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ చిమటా సుబ్బారావు, నాయకులు గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ( చందన ), సుబ్బారెడ్డి, ఇమ్మానియేలు, ఆంజనేయులు,సిబ్బంది ఛంద్రశేఖరరావు, రాఘవరెడ్డి, చం ద్రశేఖరరెడ్డి, చిరంజీవి, కోటేశ్వరరావు తదిత రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
