శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర విజయవంతం చేయాలి………….వివిధ శాఖల అధికారుల సమావేశంలో నార్త్ జోన్ డిసిపి సాధన రష్మీ పెరుమాళ్………

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల ను విజయవంతం చేసేందుకు అన్ని ముఖ్య శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ జాతరను ప్రశాంతంగా నిర్వహించాలని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నార్త్ జోన్ డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ అన్నారు. శనివారం
శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో అన్ని ముఖ్య శాఖల అధికారులతో డీ సీ పీ జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నార్త్ జోన్ డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ గత అనుభవం దృష్టిలో ఉంచుకొని ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు .జులై 21న బోనాల జాతర, 22 న రంగం ,భవిష్యవాణి, అంబారీ ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు, దానికి తగ్గట్లుగా ఆలయానికి వచ్చే మార్గాలతో పాటు ఆలయం వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో దేవాలయం ప్రాంగణం తో పాటు ఆలయానికి వచ్చే మార్గాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని భక్తులకు క్యూలైన్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేయాలని తాగునీటిని అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు ఆలయానికి
వచ్చే మార్గాల్లో వీధిలైట్లు పూర్తిస్థాయిలో వెలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. వాటర్ వర్క్స్ అధికారులు ఆలయానికి వచ్చే మార్గాల్లో డ్రైనేజీలు పొంగకుండా నీరు రోడ్లపై పారకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిసిపి సూచించారు. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పట్టేష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు .ఈ సమావేశంలో ఈవో గుత్తా మనోహర్ రెడ్డి , జీ హెచ్ ఏం సీ జోనల్ కమిషనర్ రవికిరణ్ డీ ఎమ్ హెచ్ ఓ వెంకట్, ఏ సి పి సుబ్బయ్య, డీఎఫ్ఓ ధనుంజయ్ ,మహంకాళి ఇన్స్పెక్టర్ పరశురాం జిహెచ్ఎంసి ట్రాఫిక్ విద్యుత్ వాటర్ వర్క్ తదితర ముఖ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *