మురుగునీరు పొంగి ప్రధాన రోడ్లపై పారుతుంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బేగంపేటలో రోజు మార్చి రోజు ఇలా డ్రైనేజీ వ్యర్ధాలు నీరు రసూల్ పుర మెట్రో స్టేషన్ పక్క నుంచి మినిస్టర్ రోడ్డు వరకు పారుతుంది .దీంతో వాహనాలపై వెళ్తున్న వారు తీవ్ర ఇక్కట్లకు గురవుతుండగా, వాహనాలు వెళ్తున్న సమయంలో నీరు చింది మీస్ పడుతుందని పాదచారులు వాపోతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు మొదలు రసూల్‌పురా జంక్షన్‌లోని బ్యాంకుకు, పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లేవారు
ఇలా ప్రతి ఒక్కరూ మురుగు నీటి వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. మినిస్టర్ రోడ్ లోని సాయిబాబా ఆలయానికి వెళ్లి వచ్చేవారు మురుగునీటిలో నుంచి రావాలంటే అసౌకర్యానికి గురవుతున్నారు.ఈ సమస్యను సంబంధిత శాఖాధికారులు గాని, ప్రజాప్రతినిదులు గానీ పట్టించుకోకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ముఖ్యంగా ద్విచక్ర వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .మెట్రో స్టేషన్ లో రైలు దిగిన వారు సైతం పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లాలంటే ఈ మురుగునీటిలో దిగి నడిచి వెళ్లాల్సిన దుస్థితి. మురుగు నీరు బయటకు వచ్చే ప్రాంతంలోని మరో బ్యాంకు ఉంది .దీంతో ఆ బ్యాంకుకు వచ్చేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.రసూల్ పుర మెట్రో స్టేషన్ ముందు పొంగుతున్న మురుగునీటి నుంచి విముక్తి కల్పించాలని పాదచారులు ద్విచక్రవాహనదారులు కోరుతున్నారు.
