డెంగ్యూ నివారణే ఉత్తమ రక్షణ అని తాళ్లూరు పీహెచ్ సి వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి అన్నారు. తాళ్లూరులో డెంగ్యూ మాసోత్సవంలో బాగంగా డెంగ్యూపై అవగాహన కల్పిస్తూ మంగళవారం వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత కలిగి దోమల నివారణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ దోమల ఆవాసాలను ద్వంసం చెయ్యాలని అన్నారు. డీఎంపీఓ సుబ్బా రెడ్డి, వైద్యులు డాక్టర్ రాజేష్, పీహెచ్సీ సూపర్ వైజర్ రవి కుమార్, హెచ్ వీ కోటేశ్వరి, స్టాఫ్ నర్సు నాగలక్ష్మి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
