డిగ్రీ ఫలితాలలో యూనివర్సిటీ ఫలితాలలో ప్రథమ స్థానం సాధించిన శ్రీహర్షిణి విద్యార్థి – యూనివర్సిటీ ఫస్ట్ సాధించిన విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు తెలిపిన కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గురువారం విడుదలైన నాలుగవ సెమిస్టర్ ఫలితాలలో శ్రీహర్షిణి డిగ్రీ విద్యార్థులు యూనివర్సిటీ మొదటి ర్యాంకు సాధించి విజయ ఢంకా మోగించి నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దాది ఆంజనేయులు తెలిపారు. బీఎస్సీ బయోటెక్నాలజీ- మైక్రో బయాలజీ- కెమిస్ట్రీ విభాగంలో ఎం పావని (990/1000 ) మార్కులతో మొదటి స్థానం, ఎం మెర్సి( 967 ) రెండవ స్థానం , కె చంద్రిక (955 ) మూడవ స్థానం సాధించారని తెలిపారు. బీఎస్సీ ఫిజిక్స్ విభాగంలో టి విజయలక్ష్మి (883 /900 )మార్కులతో మొదటి స్థానం ,పి వైష్ణవి (879) మార్కులతో రెండవ స్థానం, జి శివపార్వతి (866)మూడో స్థానం సాధించారని., బిఎస్సి స్టాటిస్టిక్స్ విభాగంలో కే సుజిత (876/900) మార్కులతో మొదటి స్థానం, జి లావణ్య (873) రెండవ స్థానంలో, కె సోని (872) మార్కులతో మూడవ స్థానం సాధించారని, బీఎస్సీ బోటనీ- జువాలజీ- కెమిస్ట్రీ విభాగంలో బి అనూష (973/ 1000 )మార్కులతో మొదటి స్థానం, షేక్ ఆషాభాను (963) రెండవ స్థానంలో, వి ఆశ్రయ (940) మార్కులతో మూడవ స్థానం సాధించారు. బి సి ఏ విభాగంలో యు అర్చన (935/ 1000 )మార్కులతో మొదటి స్థానం, జే ఆదిలక్ష్మి (934)మార్కులతో రెండవ స్థానం, వై గంగాభవాని (925) మార్కులతో మూడవ స్థానం సాధించారు. బీఎస్సీ అగ్రికల్చర్ విభాగంలో కే సింధుజ (940)మార్కులతో మొదటి స్థానం, పి సాద్విక ( 925)రెండవ స్థానం, ఎం నసీంమున్నీసా (922 )మూడవ స్థానం సాధించారు. బీఎస్సీ ఆక్వాకల్చర్ విభాగంలో జి త్రివేణి ( 854/1000) మార్కులతో మొదటి స్థానం, ఎస్ అనిల్ (824 ) మార్కులతో రెండవ స్థానం సాధించారు. బిఎస్సి టాలీ విభాగంలో జి లక్ష్మి (886/ 1000) మొదటి స్థానం, ఎస్ శివశంకర్ రెడ్డి (885) రెండవ స్థానం, జి పూజిత (882) మూడవ స్థానం సాధించారు. బీకాం విభాగంలో ఈ వెంకట సాయి లహరి (731/800) మార్కులతో మొదటి స్థానం, సిహెచ్ సింధు (724) రెండవ స్థానం, ఎస్ భాగ్యశ్రీ (716) మార్కులతో మూడవ స్థానం సాధించారు. బి బి ఏ విభాగంలో ఎస్కే హప్స (598/700 )మార్కులతో మొదటి స్థానం, సిహెచ్ గీతిక (584)మార్కులతో రెండవ స్థానం, కే మునిషా సాయినాథ్ (567) మార్కులతో మూడో స్థానం సాధించారు. బిఏ విభాగంలో కే ఆశీర్వాదం పాల్ ( 497/600) మార్కులతో మొదటి స్థానం, ఎస్కే గణేష్ (496)రెండవ స్థానం, కే రేష్మ (491) మార్కులతో మూడవ స్థానం సాధించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ గారు మాట్లాడుతూ ..ప్రతి సెమిస్టర్ క్రమం తప్పకుండా యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధిస్తున్న విద్యార్థులు శ్రీహర్షణి విద్యార్థులు కావడం గర్వకారణం అని తెలియజేశారు. డిగ్రీ తో పాటు విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ శ్రీ హర్షిణి అని తెలియజేశారు.ఈ సంవత్సరం ఇప్పటివరకు 775 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దాది ఆంజనేయులు, పీజీ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి, ఏవో ర్యాంకర్స్ శ్రీనివాసరావు, క్యాంపస్ ఇంచార్జ్ ధిరీష్ మరియు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *