ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఎంఈఓ (1) జే సుబ్బారావు, ఎంఈఓ (2) కే వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ముండ్లమూరు మండలంలోని సుంకర వారి పాలెం, వేముల,పలుకు రాళ్ల తండా గ్రామాల్లో గల పాఠశాలలో నేను బడికి పోతా కార్యక్రమం లో భాగంగా గ్రామాలలో శుక్రవారం ర్యాలీ
నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …బడి బయట విద్యార్థులు లేకుండా చూడాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. 6సంవత్సరాల వయసు నుండి 14 సంవత్సరాల వయసు మధ్య వయసు ఉన్న వారందరినీ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరాలంటే చదువుతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పలు సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 15వేల రూపాయలు అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బివి రమణారెడ్డి, టిఎస్ఆర్ ఆంజనేయులు, పి సాయి లక్ష్మి, బి లింగమూర్తి, వి భవాని శంకర్, జే అంజిరెడ్డి, ఎం వేణుగోపాల్, ఐ శ్రీనివాసులు, టి సురేష్, ఎం గోపి, పి నిర్మల, వి రాజ్యలక్ష్మి, ఎస్ కే సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.
