సి.టి.సి. గోషామహల్ పోలీస్ ట్రైనీ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన…… వేగం ముఖ్యం కాదు,ప్రయాణించే దిశ ముఖ్యం ……………….బేగంపేట్ టి టి ఐ ఏ సీ పీ జీ.శంకర్ రాజు….

వాహనదారులు తమ వాహనాలపై వేగంతో ప్రయాణించదం ముఖ్యం కాదని, ప్రయాణించే దిశ ముఖ్యమని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు అన్నారు.
శనివారం సి.టి.సి. గోషామహల్ పోలీస్ ట్రైనీ విద్యార్థులు, వారి సిబ్బంధికి రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఏ సీ పీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని అన్నారు. యువత ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు అని అన్నారు. సిగ్నల్ జంపింగ్ అతి ప్రమాదకరం, ముఖ్యంగా
రెడ్ సిగ్నల్ పడినప్పుడు తప్పనిసరిగా వాహనం ఆపాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.5000 వరకు జరిమానా మరియు మూడు నెలల జైలు శిక్షను కూడా విధిస్తారు. ప్రతి ఒక్కరు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి, వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. అదే విదంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు తప్పని సరిగ లైసెన్స్ తీసుకోవాలి అని చెప్పారు. వాహనాలు నిర్లక్ష్యముగ నడపటం ఎప్పుడు ప్రమాదకరం అన్నారు. వారికి కలిగిన సందేహాలను కూడా వివరించారు. ఈ కార్యక్రమములో సుమారు 150 మంది పోలీస్ ట్రైనీ విద్యార్ధులు మరియు ప్రిన్సిపాల్ శ్రీ.ఎం.ఆనంద్, వైస్ ప్రిన్సిపాల్ విక్రమదేవ్, శ్రీ.నరసింహ మూర్తి, ఆర్.ఐ, ఆర్.స్.ఐ. కుమార్, అశోక్ కుమార్ లు సీటీసీ గోషామహల్ వారి సిబ్బంది పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *