వారెవ్వా….. కలెక్టర్?. లేడీ టైగర్ అని అనవచ్చేమో…

బైక్ పై వెనకాల కూర్చున్నది ఎవరో కాదు…. పది రోజుల క్రితమే మన ఏలూరు జిల్లా విధులకు వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ వెట్రీ సెల్వి.. అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వరద నీరు ఉగ్రరూపం దాల్చింది. జిల్లా కార్యాలయంలో కూర్చుని మానిటరింగ్ చేయకుండా.. వర్షం కారణంగా ప్రజలు పడుతున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవాలనే సంకల్పంతో శుక్రవారం వేలేరుపాడు వచ్చారు. కారు వెళ్ళలేని ప్రాంతానికి మోటార్ సైకిల్ పై వెళ్లి వరద పరిస్థితిని సమీక్షించి తీసుకోవలసిన చర్యలు గురించి హుటహుటిన ఆదేశాలు జారీ చేయటం ఆమెలో ఉన్న ధైర్య సాహసాలను తెలియజేస్తుందని చెప్పాలి. అలాగే గురువారం వేలేరుపాడు ప్రాంతంలోనే వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావటానికి హెలికాప్టర్ ను సైతం సిద్ధం చేసి జిల్లా ప్రజల రాష్ట్ర ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం పొందిన కలెక్టర్ వెట్రి సెల్వి గారి ధైర్యానికి వందనం.. అభివందనం….

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *