తాళ్లూరు మాజీ ఎంపీపీ కోట రామి రెడ్డి మృత దేహానికి జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలు ఘన నివాళి అర్పించారు. అనంతరం రామి రెడ్డి అంతియ యాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక వాహనంలో అభిమానులు అమరహే నినాదాల మధ్య శ్మశాన వాటికలో అంతిమయాత్రలు నిర్వహించారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎంపీపీ పోశం మధుసూధన రెడ్డి, జిల్లా సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, పారిశ్రామిక వెత్త ఐ.వీ రెడ్డి, సీఐ వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్, పలువురు సర్పంచిలు, ఎంపీటీసీలు నివాళులు అర్పించారు. టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మానం రమేష్ బాబు, పిన్నిక రమేష్ బాబు, శనివారపు శ్రీనివాస రెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు.
