సీజనల్ గా వ్యాపించే డెంగ్యూ, మలేరియా పై అప్రమత్తంగా ఉండాలని నేషనల్ వెక్టార్ బోర్న్ డిసిడెస్ (ఎన్ వి బి డి వీ సీపీ ) రాష్ట్ర కన్సల్ టెంట్ ఈ. కొండా రెడ్డి అన్నారు. జిల్లాలో ఆయన పలు ప్రాంతాలను పరిశీలించారు. గద్దల గుంట, దారా వారి తోట సచివాలయం పరధిలోని ఇదిరా కాలనీ సందర్శించి డ్రై డేలో పాల్గొన్నారు. వైద్యశాలలో ల్యాబ్ ను పరిశీలించి తగిన సూచనలు చేసారు. డెంగ్యూ, మలేరియా కేసుల నివారణకు బాధ్యతతో పనిచెయ్యాలని చెప్పారు. స్థానిక సంస్థలతో కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లి పారిశుధ్యంపై ప్రత్యేక శ్రర్థ వహించాలని కోరారు. జిల్లా మలేరియా అధికారి శ్రావణ్ కుమార్ సబ్ యూనిట్ అధికారులు వెంకట రెడ్డి, సాగర్, శ్రీనివాసులు, బాగ్య లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
