నాగంబొట్ల పాలెం సర్పంచి చిమటా సుబ్బా రావు తల్లి కోటమ్మ చిత్ర పటానికి వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్ర సాద్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆమె సంస్మరణ సభకు ఆయన శనివారం హాజరు అయ్యారు. కార్యక్రమంలో సర్పంచి చిమటా సుబ్బా రావు, పార్టీ సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, మండల అధ్యక్షుడు ఐవీ సుబ్బా రెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూధన రెడ్డి, గోళ్ల పాటి మోషే, దోసకాయల పాడు సర్పంచి టీ ఎస్ వెంకట రామి రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
