మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు అన్నారు. తాళ్లూరు ప్రాధమిక వైద్యశాలలో మంగళవారం వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి అధ్యక్షతన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. వైద్యశాలలో ఏర్పాటు చెయ్యాల్సిన పలు పనులను గురించి చర్చించారు. రాష్ట్ర యూత్ కార్యదర్శి జి వేణుబాబు, వైద్యులు రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, యూత్ నాయకుడు ఇడమకంటి వేణుగోపాల్ రెడ్డి, గొంది రమణా రెడ్డి (సమర), ఆదినారాయణ రెడ్డి, పిన్నిక రమేష్ బాబు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలో పీహెచ్సీ వైద్యాధికారి మౌనిక ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. మలేరియా అధికారి బసవా రెడ్డి, హెచ్ ఈ ఓ చంద్రశేఖర్ బాబు, పీహెచ్ ఎన్ ఎం వీ రమణమ్మ, హెచ్పీ సుశీల, ఎ ఎన్ ఎం, ఎం ఎల్ హెచ్ పీలు పాల్గొన్నారు.

