భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారు…..సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్……………

బేగంపేట ఫిబ్రవరి 8(జే ఎస్ డి ఎమ్ న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నేటి నుండి 5 రోజుల పాటు నిర్వహించే కోటి కుంకుమార్చన ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా మహంకాళి అమ్మవారి ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. పూజలలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, ఆలయ ఈ ఓ మనోహర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ మాజీ సభ్యులు కిషోర్ కుమార్, రాంమోహన్ యాదవ్, మహేందర్, అరుణ్ భట్, ఆనంద్ పాటిల్, నాగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *