ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చెయ్యాలి – డాక్టర్ మౌనిక

గర్భిణిలు. బాలింతలు సరియైన పౌష్టికాహారం తీసుకునిఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చెయ్యాలని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ మౌనిక అన్నారు. తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలోని సోమవరప్పాడు అంగన్ వాడీ కేంద్రంలో బుధవారం పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యులు డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ లు పాల్గొని గర్బిణీలు 12 వారాల లోపు నమోదు చేసుకోవాలని చెప్పారు. అంగన్ వాడీ ద్వారా అందించే పౌష్టికాహారాన్ని తీసుకుని అధికంగా పండ్లు, కూరగాయలు వాడుకోవాలని చెప్పారు. సరియైన సమయంలో టీకాలు వేయించుకుని, చిన్నారులకు వేయించాలని సూచించారు. ఆరోగ్య మెరుగుకు పలు సూచనలు చేసారు. హెచ్ఓ చంద్రశేఖర్, పీహెచ్ఎన్ రమణమ్మ, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు అనిత, పుష్ప కుమారి, సువర్ణ, అంగన్ వాడీ టీచర్లు విజయలక్ష్మి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *