ప్రకాశం జిల్లాలో అకాల వర్షం – అపారనష్టం

జిల్లాలో బుధవారం వేకువజామున ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం రావటంతో ప్రజలు, రైతన్నలు ఆందోళన చెందారు. జిల్లాలో 38 మండలాలకు గాను 21 మండలాలో వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. అందులో అత్యధికంగా సంత నూతల పాడులో 60.8 మి.మీలు నమోదు కాగా అత్యల్పంగా దోర్నాలలో 1.0 మి.మీలు నమోదు అయినది. అదే విధంగా ఒంగోలులో 55.4 మి.మీలు, తాళ్లూరులో 45.8 , దర్శిలో 40.4, టంగుటూరులో 28.0, జరుగుమల్లిలో 24.2, శింగ రాయ కొండలో 22.2, కొండేపిలో 21.4, కొత్తపట్నంలో 20.4, మద్దిపాడులో 20.2, నాగులుప్పల పాడులో 18.4, కురిచేడులో 13.0, చీమకుర్తిలో 7.4, ముండ్లమూరులో 5.2, పొన్నలూరులో 4.2, పామూరులో 3.4, వెలిగండ్లలో 3.0, అర్థవీడులో 2.2, యర్రగొండ పాలెం, పొదిలిలలో 2.0 మి.మీల చొప్పున నమోదు అయినది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పలుపంటలకు నష్టం…. ఆకాల వర్షాల వలన మొక్కజొన్న, వరి మిరప, పొగాకులకు నష్టం వాటిల్లినది.
జిల్లాలో టంగుటూరు, సీఎస్ పురం, వెలిగండ్ల, బేస్తవారి పేటలలో వరి, జొన్న, అలచందలు, శనగ 1092.5 ఎకాల మేర పంట నష్టం వాటిల్లి నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు తెలిపారు.
ఆయా పంటలు కళ్లంలో ఉండి అకస్మాత్తుగా రావటంతో తడిచి పోయాయి. తాళ్లూరు చెందిన కోట చంద్రశేఖర్ రెడ్డి, మారం బ్రహ్మా రెడ్డి, కోట రామి రెడ్డి. కోట క్రిష్ణారెడ్డి, ఐ శ్రీనివాస రెడ్డిలకు చెందిన 20 ఎకరాలలో పొలంలో వేసిన మొక్కజొన్న విపరీతమైన గాలి వర్షానికి నేలకు వరికి తీవ్ర నష్టం వాటిల్లినది. బాగా విత్తు వచ్చే సమయంలో పంట నెలకు వరగటంతో విపరీతమైన నష్టం వచ్చే అవకాశం ఉందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

చేతికి వచ్చే సమయంలో నష్టం – కోట చంద్రశేఖర్ రెడ్డి, తాళ్లూరు,

పంట బాగా విత్తుదశలో విపరీతమైన గాలి రావటంతో పంట నెల కొరిగినది. ఈ మొక్క ఇక పైకి లేవదు కనుక విత్తునాలు సక్రమంగా రావు, దిగుబడి పూర్తిగా తగ్గుతుంది. ఎకరానికి రూ.15వేలు బర్చు పెట్టాను. మూడు ఎకరాలు సాగు చేసాను. ఉన్న పంట కోతకు కూడ మూడు వేల అయ్యేది పది వేలు అవుతుంది. ప్రభుత్వం ఆదుకోవాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *