చందనాలంకారంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి -వాసవి క్లబ్ చే వాసవిమాతకు లక్షమల్లెలార్చన.

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి మంగళవారం ఉదయం దదియతో అభిషేకం, అర్చనాధి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శర్మ, ఫణిశర్మలు నిర్వహించారు. అమ్మవారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఒంగోలు నగరంలోని ఐదు వాసవి క్లబ్స్… వాసవిక్లబ్ ఒంగోలు, వాసవిక్లబ్ విజన్, మహిళా విజన్, కేసిజిఎఫ్ యూత్ మరియు వాసవిక్లబ్ ఒంగొలు సిటిజెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో లక్షమల్లెలార్చన భక్తి పూర్వకంగా నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ముందుగా ఆలయ పరిసర గాంధీ రోడ్డు, దక్షిణ బజార్, ఏను చెట్టు వీధి, పప్పు బజార్ మాడవీధుల్లో మల్లెలను ఊరేగింపుగా వాసవి క్లబ్స్ సభ్యులు, పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య మహిళలు తీసుకుని వచ్చారు. సాయంత్రం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు చందనాలంకారంలో భక్తులను అనుగ్రహించారు. అనంతరం వాసవి కోలాట భజన మండలి సభ్యులచే కోలాట నర్తనం మరియు గుడి ఉత్సవం వైభవంగా జరిగినది.

కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, అధికారులు గార్లపాటి బ్రహ్మానందం, గార్లపాటి పరిమళ, దర్శి మనోహర్ చంద్రశేఖర్, చలువాది సత్యనారాయణ, మద్దు అరవింద లక్ష్మి, పబిశెట్టి గోవర్ధన్, చీదేళ్ళ వెంకటప్రసాద్, చీదేళ్ల లక్ష్మీరాజ్యం, భూమా శ్రీనివాసులు, కారం శెట్టి సునీత, మద్దాలి శివప్రసాద్, చీమకుర్తి శివప్రసాద్ తదితరులు మరియు అమ్మవారి భక్తులు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *