మంత్రి నారా లోకేష్ జిల్లాకు రాక నేపధ్యంలో భద్రతా ఏర్పాట్లనుపరిశీలించిన జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్

రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన టిడిపి మాజీ ఎంపిపి ముప్పువరపు వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించడానికి గురువారం రానున్న నేపథ్యంలో ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ పరిశీలించారు. ఆనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు తెలియచేశారు. నాగులుప్పలపాడు మండలం, చదలవాడలోని సాయి విష్ణు విల్లాస్ చతుర్వాటిక హెలిప్యాడ్ ప్రదేశం, కాన్వాయ్ రూట్ మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించారు.హెలిప్యాడ్ నుంచి అమ్మనబ్రోలు వరకు ఉన్న రూట్ ను క్షుణ్ణంగా పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా, రూట్ & రూఫ్ – టాప్ ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు, పోలీసు జాగీలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) నాగేశ్వర రావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు రూరల్ సీఐ యన్.శ్రీకాంత్ బాబు, ఆర్ఐ రమణారెడ్డి, యన్ జి పాడు ఎస్సై శ్రీకాంత్, ఎస్సైలు మరియు సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *