ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన నాగులుప్పల పాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసులో ముద్దాయిలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ ఎ ఆర్ దామోదర్ వెల్లడించారు. వివరాలలోనికి వెలితే ….. వీరయ్య చౌదరి నాగులుప్పల పాడు మండలం అమ్మన బ్రోలు గ్రామ వాసి, ఒంగోలు రాజీవ్ నగర్ లో నివాసం ఉంటూ లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ సంతనూతల పాడు నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీలో క్రీయా శీలక రాజకీయం చేస్తూ పార్టీలో ఉన్నత స్థాయికి చేరాడు. అయితే అమ్మబ్రోలు గ్రామానికి చెందిన సిద్ధాంతి ఆళ్ల సాంబయ్య, ముప్పాళ్ల సురేష్ లు వీరయ్య చౌదరికి మొదటిలో అనుకూలంగా ఉండి కాలక్రమేణా రాజకీయ వర్గ విభేదాలతో వ్యతిరేకం అవుతారు. గ్రామంలో అధి పత్య పోరు ఏర్పడి వారి మధ్య మనస్పర్థలతో పెరిగి ఒక పథకం ప్రకారం వీరయ్య ఉంటే తమకు రాజకీయ భవిష్యత్, పరపతి ఉండదని భావించారు. ఈ తరుణంలో ఇసుక వ్యాపారం చేస్తూ వీరయ్య చౌదరి వలన నష్టపోయానని భావిస్తున్న వినోద్ ను తోట శ్రీను అనే వ్యక్తి ద్వారా కలుస్తారు. హైదరా బాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొన్ని లావా దేవీలలో ఆళ్ల సాంబయ్య, వినోద్, తోట శ్రీనులు ముప్పా సురేష్ను కలిసే వారు. ఈ నేపథ్యంలో ముప్పా సురేష్ నెల్లూరుకు చెందిన పలువురు రౌడీ షీటర్లతో పరిచయాలు ఉన్నాయని తెలుసుకున్నారు. సురేష్ చెన్నైకి చెందిన రఘరామ్ అనే వ్యక్తి రూ. 9 కోట్లు బకాయిలు ఉండటంతో దాని తాలూకా వసూలు చేయటకు ఆళ్ల సాంబయ్య, వినోద్ కొంత మంది నెల్లూరు చెందిన సురేష్ స్నేహితులు చెన్నైకి వెళ్లి బెదిరిస్తారు.
దీంతో వారిపై మరింత నమ్మకం పెరుగుతుంది. ఆళ్ల సాంబయ్యకు ముప్పా సురేష్ కు మృతుడు వీరయ్య తరచూ తన వ్యాపారాలో మరియు రాజకీయంగా అడ్డు వస్తున్నారనే వినోద్ ద్వారా మాట్లాడి గతంలో తాను వ్యాపారం కోసం ఇచ్చిన రూ.20 లక్షల రూపాయలు తనకు ఇవ్వవద్దని, వాటితో పాటు వీరయ్యను బౌతికంగా అంతం చేస్తే ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని చెప్పాడు. అందుకు ఒప్పదం కుదురు తుంది.
ఇటువంటి పనులు చేయ్యవద్దన్న దేవంద్ర నాథ్ చౌదరి ……..
అయితే ఈ విషయాలను ఒకానొక సందర్భంలో ఒక ప్రవేట్ వైద్యశాల వద్ద తారస పడ్డ దేవంద్ర నాథ్ చౌదరికి వినోద్, తోట శ్రీనులు ఆళ్ల సాంబయ్య…. వీరయ్య చౌదరిపై మర్దర్ కి
ప్లాన్ చేస్తున్నారని చెప్పగా అందుకు ఆయన ఇటువంటి విషయాలు తనతో చెప్పవద్దని. ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి అప్పటి నుండి వారితో ఫోన్ లో కాంటాక్ట్ లేకుండా ఉన్నాడు.
అనంతరం వినోద్ నెల్లూరుకు చెందిన గోళ్ల రేత్యేం ద్ర బాబు ( నాని ) తో కలసి వీరయ్య హత్యకు పథకం రచించి కిరాయి హంతకులైన తువ్వర వంశీ క్రిష్ణ, మన్నేం తేజ (బన్నీ). వినోదు పరిచయం ఉన్న బెల్లం కొండ గౌతమ్, నాగరాజులతో కలసి హత్యకు పథకం రచించి పలు మార్లు రెక్కి నిర్వహిస్తారు. వీరికి కాలసిన రూమ్స్, భోజన వసతులను వినోద్ ఏర్పాటు చేస్తాడు. మోటార్ సైకిళ్లను సైతం తన వద్ద పనిచేసే షమీర్ ద్వారా సమకూర్చుతాడు. రూట్ మ్యాప్ రెక్కిలో తోట శ్రీను సహాయం తీసుకుంటారు. పథకం ప్రకారం స్కూటీలో పది వేల నగదు, ఒక హోరూం వద్ద ఉంచుతారు. స్కూటర్, ఆటోలలో చేరుకున్న ముద్దాయిలు పథకం ప్రకారం వీరయ్య చౌదరిపై విచక్షనా రహితంగా కత్తులతో దాడి చేసి తుదిముట్టించారు. పథకం ప్రకారం స్కూటర్, బైక్లపై పరారయ్యారు.
7 గురు ముద్దాయిలు అరెస్ట్ ….. బోర్లగుంట వినోద్ కుమార్, తువ్వర వంశీ క్రిష్ణ, బెల్లం కొండ వెంకట గౌతమ్, మన్నేం తేజ మార్టూరి కిరణ్ కుమార్, షేక్ సమీర్, ఆళ్ల సాంబశివ రావు . వీరగంధం దేవేంద్ర నాథ్ చౌదరి, తోట శ్రీనివాసరావు అను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 7 ఫోన్లు, 3 కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో ఉన్న ముద్దాయిలు…వీరే …
ముప్పా సురేష్, ఓబిలినాగరాజు, గోళ్ల రుత్యేంద్ర బాబు (నాని)లు పరారిలో ఉన్నట్లు చెప్పారు.
పలువురు పోలీసులకు అభినందన ….
జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన కేసును ఛేధించటంతో జిల్లా ఎస్పీ ఎ ఆర్ దామోదర్ తన సిబ్బందితో ప్రత్యేక దృష్టి సారించి క్షణాల వ్యవధిలో ప్రాధమిక వివరాలు రాబట్టారు. ఆధారాల సేకరణకు ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, సీఐఎస్, ఒంగోలు తాలూకా పీఎస్, మహిళా పీఎస్, చీమకుర్తి పీఎస్ సీఐ ట్రాఫిక్, సీఐ – ఐటీ కోర్, ఒంగోలు, సీఐ మార్కాపూర్, సీఐలు ఒంగోలు రూరల్ వై పాలెం, ఎస్సై లు ముండ్ల మూరు, జరుగు మల్లి, ఎస్ ఎన్ పాడు, పెద్దార వీడు, మద్ది పాడు, కొత్త పట్నం, మార్కాపురం రూల్, దోర్నాల ఎస్ఐ సందీప్, ఒంగోలు తాలూకా ఆర్ ఎస్ ఐ మాల్యాద్రి ఇంకా మరికొంత మంది అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ అభినందించారు.



