తాళ్లూరు- వెల్లంపల్లి రహదారిలో శివ రామ పురం దాటిన తర్వాత ఉన్న మలుపు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు – లారీ ఢీ కొన్నాయి. పూర్తి మలుపు ఉన్న వద్ద తాళ్లూరు నుండి వెల్లంపల్లి వైపు వెళ్తున్న లారీ, ఒంగోలు నుండి తాళ్లూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. బస్సులో కుడివైపు ప్రయాణికులు కూర్చున కిటికీ వైపు తగలటంతో నాలుగు కిటికి అద్దాలు, రైలింగ్, బస్సు బాడీ పూర్తిగా ద్వసం అయ్యాయి.ప్రమాద జరిగిన విషయం సమాచారం అందుకున్న ….. తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, కెవీ పాలెం సర్పంచి శ్రీదేవి రామయ్య, టిడిపి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు ఘటన జరిగిన తీరును పరిశీలించి తీరును పరిశీలించి ఎవరికైనా దెబ్బలు తగిలాయా అని వాకబు చేసారు. ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికి పెద్ద గాయాలు కాక పోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తాళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసారు.

