పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఎంపీడీఓ దార హనుమంత రావు అన్నారు. మండలంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర
కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శుభ్రత కార్యక్రమాలను తహసీల్దార్ సంజీవ రావు, ఎంపీడీఓ దార హనుమంత రావులు ప్రారంభించారు. మన చుట్టూ పరిసరాలను మనమే శుభ్రం గా ఉంచుకోవాలని మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. శివరామపురం, కొర్ర పాటి వారి పాలెం, మాధవరం పంచాయితీలలో కూడ స్వచ్చ ఆంధ్ర – స్వర్ణాంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా విఠలాపురం పంచాయితీ కూడ కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లిన ఎంపీడీఓ పంచాయితీలో అపరిశుభ్రంగా ఉండటం చూసి అవాక్కయ్యాడు. అదే విధంగా సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శితో పాటు పలువురు సిబ్బంది గైర్హాజరు అవటం గమనించి సంబంధించిన వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *