వేసవి కాలంలో వడ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేలా బీట్ ద హీట్ అనే అంశంతో ఈ రోజు స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
పేర్కొన్నారు.
శనివారం ఉదయం కొత్తపట్నం మండలం, అల్లూరు గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. తొలుత అల్లూరులో ఏర్పాటు చేసిన చలివేంద్రంను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి వర్మీ కంపోష్ట్ తొట్టెలను, కేంద్రం పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి రోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యక్రమం ఏ విధంగా జరుగుచున్నది, ఎంతమంది సిబ్బంది వున్నారు, సేకరించిన చెత్తను ఏ విధంగా తడి చెత్త, పొడి చెత్తగా వేరుచేస్తున్నారు, తదితర వివరాలను పంచాయతీ కార్యదర్శి, జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా క్లాప్ మిత్రలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నెలకు ఎంత జీతం ఇస్తున్నారు, హెల్త్ కార్డ్స్, ఇన్సూరెన్స్ ఉందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో ఉపాధి హామీ పధకం కింద నిర్మించిన పశువుల నీటి తొట్టెను, ఏర్పాటుచేసిన కంపోష్ట్ పిట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లో భాగం గా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా పాల్గొని మాట్లాడుతూ, వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడవ శనివారం ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తో స్వర్ణ ఆంద్ర – స్వచ్చ ఆంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీట్ ద హీట్ అనే అంశంతో ఈ రోజు స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్నీ గ్రామాల్లో, పట్టణాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వేసవి కాలంలో వేడి గాలులు వలన ఎవరు వడదెబ్బ కు గురి కారాదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ బీట్ ద హీట్ అనే అంశంతో ఈ రోజు స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వేసవిలో హీట్ స్టోక్ తగలకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలన్న విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుచున్నదన్నారు. వైద్యులు సూచించిన విధంగా వేసవిలో హీట్ స్టోక్ తగలకుండా అవసరమైన ముందస్తు చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు, ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని, అలాగే మహిళలందరూ చిన్న చిన్న మొక్కలతో రూఫ్ టాప్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రముఖ రద్దీ కూడళ్లలో నీడ సౌకర్యం కోసం షెడ్స్ ఏర్పాటుచేసుకోవాలని, బిల్డింగ్‌లపై చల్లదానికి కూల్ వైట్ పెయింటింగ్ చేసుకోవడం, చలివేంద్రాల ఏర్పాటు చేయడం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంటలు ఏర్పాటుచేయడం, మొక్కలు నాటడం వంటి ఉష్ణోగ్రతను తగ్గించే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నదని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, పిల్లలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం వైద్యశిబిరాలు ఏర్పాటుచేయడం జరుగుచున్నదని, ప్రజలు ఈ మెడికల్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రత కలిగిన గ్రామంగా తీర్చిదిద్దేలా డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యక్రమం పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలో సేకరించిన చెత్తను చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించి చెత్తను ఎరువుగా మార్చడానికి చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మండలంలో ఒక గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసి విజువల్ క్లీన్ విలేజ్ గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని, అల్లూరు గ్రామాన్ని కూడా విజువల్ క్లీన్ విలేజ్ గా తీర్చి దిద్దేలా గ్రామస్థులు కృషి చేయాలన్నారు. ఈ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద అనేక పనులు చేపట్టడం జరుగుచున్నదని కలెక్టర్ తెలిపారు. ఈ గ్రామంలో ఉన్న నీటి వనరులను పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడంతో గ్రామంలో ఉన్న చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎల్. అంజిరెడ్డి, ఎంపిటిసి శాంతారావు, వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఉద్దేశ్యాన్ని , ఆయా శాఖల ద్వారా క్షేత్ర స్థాయిలో జరుగుచున్న కార్యక్రమాల వివరాలను వివరించారు.
అనంతరం, స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంకు సంబంధించిన ప్రతిజ్ఞ చేసారు. గ్రామ సర్పంచ్ నంబూరు సూర్య నారాయణ, ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిపిఓ వెంకట నాయుడు, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, తహసీల్దార్ మధుసూదన్ రావు, ఎంపిడిఓ క్రిష్ణ, ఈఓ ఆర్డి, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.


