ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు ఎంచుకోవాలి.

ఖరీఫ్ సాగుకు రైతులు అనువయిన వరి రకాల విత్తనాలు ఎంచుకుని దృవీకరించిన
విత్తన దుకాణాలలో విత్తనాలు తీసుకుని సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని చెప్పారు. విత్తన కొనుగోలు సమయంలో బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. మెరక భూముల్లో నన్న గింజ రకాలు, పల్లపు భూముల్లో మధ్యస్థ రకాలు సాగు చేపట్టాలని కోరారు. సన్న రకాలైన ఎం టీ యూ 1224, 1271, 1190 రకాలు 140 రోజుల వ్యవధి అని, దీర్ఘ కాలిక రకాలు బి పిటీ 5204, ఎంటీ యూ 1262, బి పి టీ 2595, 2846, 2782 వి 150 రోజుల వ్యవధి అని తెలిపారు. చౌడు భూములు ఎంసీ ఎం 100, 103 రకాలు 150 రోజుల వ్యవధి అని, మన నేలకు, మన వాతావరణ పరిస్థితులకు అనువైన రకాలను సేకరించుకుని సాగు చేసుకోవాలని చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *