క్షయ వ్యాధి రహిత పంచాయితీలుగా మండలంలోని బొద్దికూరపాడు, లక్కవరం గ్రామాలు ఎంపికయ్యాయి. బొద్దికూరపాడు పంచాయితీ నర్పంచి మందా శ్యామ్సన్కు జిల్లా లో నిర్వహించిన టీబీ ముక్తభారత్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ అవార్డును అందించారు. అవార్డు అందుకున్న సర్పంచిను ఉప నర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు. స్వచ్చ భారత్ కార్యక్రమాలతో పాటు ప్రజలకు మేలు చేసే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయటానికి తమ వంతు చేయూత అందిస్తామని ఈ సందర్భంగా సర్పంచి మందాశ్యామ్సన్ తెలిపారు.
