స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలి -స్వర్ణాంధ్ర విజన్ పై మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి సమీక్ష

స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై బుధవారం నాడు తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ సభ్యులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ……స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి రేటు 15 శాతం సాధించేందుకు లక్ష్యం మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా పరిశ్రమలు, ఉద్యాన, వ్యవసాయ రంగాల్లోనూ చక్కని పురోగతి సాధించేందుకు అవకాశం ఉందన్నారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని… ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు బాధ్యతా యుతంగా పనిచేయాలని మంత్రి డా.డోలా వీరాంజనేయస్వామి అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *