తూర్పుగంగవరంలో ప్రధాన వీదులలో మురుగు నీరు పేరుగు పోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. ప్రధాన వాణిజ్య కేంద్రం కావటంతో చుట్టు ప్రక్కల ప్రజలు నిత్యం గ్రామంలో సంచరిస్తూ ఉంటారు. ఈ మురుగు నీటి వాసన రావటంతో పారిశుధ్యం పైన పటారం లోన లోటారం చందంగా ఉందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం సంవత్సర పాలనలో సంబరాలు చేస్తుంటే ఈ దుర్వాసన భరించలేక ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. అంతా తెలిసిన అధికారులు పనితీరు మాత్రం మాటలు కోటలు దాటతాయి కాళ్లు గడప తాటని చందంగా తయారు అయ్యాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు నీటి ఇబ్బందులు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
