భూ యజమానులు కౌలు రైతులకు సహకరించాలి – పంట సాగు పత్రాలతో బహు ప్రయోజనాలు- ఒంగోలు ఆర్ డీఓ లక్ష్మి ప్రసన్న

భూ యజమానులు కౌలు రైతులకు సహకరించి పంట సాగు పత్రాల మంజూరు అయ్యే విధంగా అవసరమైన భూ దృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఒంగోలు ఆర్ డీఓ లక్ష్మి ప్రసన్న కోరారు. దళిత బహుజన రిసోర్స్ ఆధ్వర్యంలో పంట సాగు దారుల చట్టం ప్రచారోద్యం వాహనాన్ని తాళ్లూరులో ఆర్డీఓ జెండా ఊపి ప్రారంభించారు. తహసీల్దార్ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ కౌలు దారులకు పంట పై మాత్రమే హక్కు ఉంటుందని, భూమి పై ఎటువంటి హక్కు ఉండదని అన్నారు. ఈ విషయాలను క్షేత్ర స్థాయిలో రెవిన్యూ యంత్రాంగం ప్రచారం నిర్వహిస్తున్నారని వారితో పాటు డిబిఆర్నీ కూడ ప్రచారం నిర్వహించటం అభినందనీయమని అన్నారు. రజానగరం, కొర్రపాటి వారి పాలెం, తాళ్లూరు, తూర్పుగంగవరం, నాగంబొట్ల పాలెం, దారం వారి పాలెం, లక్కవరం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. డిబిఆర్నీ రీజనల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు, దర్శి ఎరియా కోఆర్డినేటర్ గుంటూరు నాగమణి తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్ బంకు ఏర్పాటు స్థలం పరిశీలన …

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాళ్లూరు, తూర్పుగంగవరం రోడ్లో ఏర్పాటు చేయనున్న భారత్ పెట్రోల్ బంకు స్థలాన్ని ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న పరిశీలించారు. నర్వే నంబర్లు, ఇతర వివరాలను పరిశీలించారు. తహసీల్దార్ లక్ష్మి నారాయణ, ఆర్.ఐ అనూష పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *