దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో మారెళ్ళ లో ఘనంగా నిర్వహించారు. ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో వైయస్సార్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి వైయస్ఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
