ముండ్లమూరు మండలంలోని పులిపాడు గ్రామంలో గత మూడు రోజులుగా పీర్ల పండుగను భక్తులు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఆదివారం రాత్రి పెద్ద సరిగెత్తు సందర్భంగా పీర్ల చావిడి దగ్గర నిప్పుల గుండంలో పలువురు భక్తులు పీర్లను ఎత్తుకొని నడిచారు. పులి పాడు గ్రామంలో ఆదివారం పీర్లను ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పీర్లకు బొరుగులను నైవేద్యంగా సమర్పించారు. పలు సాంస్కృతిక కార్యక్రమా లతో భక్తులు సందడి చేశారు. గ్రామంలో సాంప్రదాయ ప్రకారం కొందరు భక్తులు వివిధ వేషాలతో అలరించారు.
