ప్రభుత్వం
విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టి విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను ఖర్చుచేస్తుందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ పేర్కొన్నారు.
నాగులుప్పలపాడు మండలం, అమ్మనబ్రోలు గ్రామంలో గల సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని, ఆంద్రప్రదేశ్ గురుకుల బాలికల విద్యాలయాన్ని శుక్రవారం జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ ఆకస్మిక తనిఖీ చేసారు. తొలుత జిల్లా ఇంచార్జి కలెక్టర్ గోపాల క్రిష్ణ, ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్ధులకు అందిస్తున్న వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా హజరు రిజిస్టర్ ను, స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్ ను పరిశీలించి స్టాక్ రిజిస్టర్ ప్రకారం సరుకులు ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా పరిశీలన చేసి స్టాక్ రిజిస్టర్ ప్రకారం, స్టోర్ రూమ్ లో సరుకుల నిల్వలు వ్యత్యాసం ఉండటం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్ ను అప్ డేట్ చేయాలని ఆదేశించారు. విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి గృహం నిర్వహణ పక్కాగా నిర్వహించాలని, సోమవారం నాటికి వసతి గృహం కిటికీలకు దోమతెర మెష్ ఏర్పాటు చేయడం తో పాటు టాయిలెట్స్ మరమత్తులు చేపట్టాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కంప్లైంట్ బాక్స్ తో పాటు మెనూ చార్ట్ ను వెంటనే ఏర్పాటు చేయాలని అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ ను కుడా ఏర్పాటు చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్, వసతి గృహం సంక్షేమ అధికారిని ఆదేశించారు. వసతి గృహంలో అనువైన ఖాళీ ప్రదేశం ఉందని, కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా ఇంచార్జి కలెక్టర్ గోపాల్ క్రిష్ణ, అమ్మనబ్రోలు లోని ఆంద్రప్రదేశ్ గురుకుల బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులను సందర్శించి స్కూల్లో చదువు బాగా చెబుతున్నారా, ప్రస్తుతం ఏ లెసన్ చెపుతున్నారు అని ఆరా తీస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్ధుల పాఠ్యాంశాల సామర్ద్యాన్ని స్వయంగా పరిశీలించడం జరిగింది. స్కూల్ యూనిఫార్మ్స్, షూస్ ఇచ్చారా అని విద్యార్ధులను అడిగి తెలుసుకుని ప్రతి విద్యార్ధికి కచితంగా విద్యా కిట్ ఇవ్వాలన్నారు. ఎన్రోల్మెంట్ ఎలా ఉంది, ఎ క్లాస్ లో ఎంత మంది విద్యార్ధులు ఉన్నారు తదితర వివరాలను జిల్లా ఇంచార్జి కలెక్టర్, విద్యాలయం ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెనూను కచితంగా అమలు చేయాలని, అలాగే నాణ్యతతో భోజనం విద్యార్ధులకు అందించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ విద్యార్ధులకు స్వయంగా భోజనం వడ్డించి, రుచి చూసారు. గురుకుల విద్యాలయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్ధులను అడిగి తెలుకున్నారు. విద్యార్ధులకు నిర్దేశించిన షెడ్యుల్ ప్రకారం సిలబస్ పూర్తీ చేయాలని ఆదేశించారు.
జిల్లా ఇంచార్జి కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మా నాయక్, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి నిర్మలజ్యోతి, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, విద్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

