జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ క్లెయిమ్స్ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎన్ హెచ్- 565, ఎన్ హెచ్- 216, ఎన్ హెచ్- 544 డి, ఎన్ హెచ్- 167బి, ఎన్ హెచ్- 765, ఎన్ హెచ్- 544 జి, మరియు నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైన్ తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పురోగతి పై సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, ప్రాజెక్టుల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఇంచార్జి కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ… సంబంధిత ప్రాజెక్టు లకు సంబంధించి భూ సేకరణ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ల్యాండ్ క్లెయిమ్స్, స్ట్రచర్ క్లెయిమ్స్ క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూ సేకరణ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న అవార్డు లు పాస్ చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రెవెన్యూ మరియు సంబంధిత ప్రాజెక్టుల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యం మేరకు భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

