దర్శి మార్కేట్ కమిటీ వైఎన్ చైర్మన్ పదవిని తాళ్లూరు మండలం లక్కవరం వాసి బొడ్డు
హనుమా రెడ్డి సతీమణి బొడ్డు నాగేంద్రంను వరించినది. దర్శి మార్కేట్ కమిటీని లో చైర్మన్, వైఎన్ చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తూ వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి బి రాజశేఖర్ గురువారం ఉత్తర్వులు జారీ చేసారు. అందులో బాగంగా దర్శి నియోజక వర్గ బిజేపి ఇన్ చార్జి మాడపాకుల శ్రీనివానులు నతీమణి మాడపాకులు నారాయణమ్మను కమిటీ చైర్మన్ గా, లక్కవరం వాసి బొడ్డు నాగేంద్రంను వైఎన్ చైర్మన్ లు గా వారితో పాటు మరో 17 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో తాళ్లూరు మండలానికి చెందిన దోసకాయలపాడు సీనియర్ నాయకులు నల్లపాటి సత్యనారాయణను మల్కాపరం, మాజీ సర్పంచి షేక్ ఖాశిం సైదా (వలి) లను డైరెక్టర్లుగా నియమించారు. మండలంలో పూర్తిస్థాయిలో వైసీపీకి పట్టు ఉన్న పంచాయితీ లక్కవరంలో ఆపార్టీ ప్రాధాన్యతను పూర్తి స్థాయిలో తగ్గించటానికి కృషి చేసిన లక్కవరం గ్రామ టిడిపి పార్టీ కృషిని అధిష్టానం గుర్తించి ఆ గ్రామానికి పార్టీ పదవులు, నామినేటేట్ పదవులు కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. అందులో బాగంగానే మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్ది లక్కవరం వాసి కాగా, అదే గ్రామానికి చెందిన బొడ్డు నాగమణికి మార్కేట్ కమిటీలో వైన్ చైర్మన్ పదవి కేటాయింపు జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మండలంలో గతంలో టిడిపి పాలనలో ఏనాడు మండలానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కాని నేడు కూటమి పాలనలో సామాన్య మైన వారికి సైతం పదవులు వరించటంపై రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పదవుల కేటాయింపు ఎలా జరిగి ఉంటుందని విశ్లేషకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా మండలానికి మంచిగా పదవులు రావటంపై టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, పదవులు పొందిన వారికి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ పదవులు కేవలం కంప్యూటర్ ఆపరేటర్ మిస్టేక్ వల్ల వచ్చాయని… ముందుగా ప్రతిపాదించిన వారికే పదవులు వస్తాయి అని దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
