ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యం…..ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట జూలై 12(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రజల అవసరాలను తెలుసుకొని వాటినీ పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం బేగంపేట లోని ఎయిర్ లైన్స్ కాలనీలో 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సి సి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలు, బస్తీలు అనే తేడాలు లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి కి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రధానంగా రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. ఎయిర్ లైన్స్ కాలనీలో కూడా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లు, పార్క్ ల అభివృద్ధి వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, శేఖర్, ఆకుల హరికృష్ణ, ఆరీఫ్, మెయిన్, నాని, నాగరాజు గౌడ్, కాలనీ ప్రతినిధులు నగేష్, గోపాల్, రాజేందర్, మహేష్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *