గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని విఠ లాపురంలో గురువారం వెలుగు చూసింది. పోలీ సుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కైపు బయపురెడ్డికి విపరీతమైన కడుపునొప్పి వచ్చిం ది. ఆ నొప్పి తట్టుకోలేక గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని
తొలుత స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు ఆ తర్వాత ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ రమేష్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జునరావు తెలి పారు.
విఠ లాపురంలోగడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
18
Jul