తూర్పు వెంకటాపురం పాఠశాల వద్ద ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫీజు బాక్స్ ఉన్నది. ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఎత్తు తక్కువలో ఉన్న ఫీజు బాక్స్ వేరు ప్రమాదవశాత్తు తగిలినట్లయితే విద్యార్థులకు ప్రాణ ప్రమాదం ఉన్నదని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వివరాలలోకి వెళితే… తూర్పు వెంకటా పురం మోడల్ ప్రైమరీ పాఠశాలలో 105 మంది విద్యార్థులు చదువుకొనుచున్నారు . వారు దాదాపు ముప్పావు కిలోమీటర్ల దూరం నుండి 50 మంది విద్యార్థులు పాఠశాలకు ప్రతిరోజు రహదారి వెంట రాకపోకలు కొనసాగిస్తున్నారు. పాఠశాల పక్కనే విద్యుత్తు ట్రాన్స్ఫారం, ఫీజు బాక్స్ కేవలం 3 అడుగుల ఎత్తులోనే ఉన్నది . ఇది పిల్లలకు చేతికి అందుబాటులో ఉండడంతో చాలా ప్రమాదకర మని ..పిల్లలను పాఠశాలకు పంపాలంటేనే మాకు చాలా భయంగా ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు బాక్స్, ఎర్త్ వైర్ తక్కువ ఎత్తులో ఉండటం వలన గ్రామంలోని గేదెలు, గొర్రెలు, మేకల వంటి వాటి కూడా చాలా ప్రమాదకరంగా పొంచి ఉంది. కావున వెంటనే విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి, ఫీజు బాక్స్ ఎత్తు పెంచి , స్తంభం చుట్టూ రక్షణ కంచె కానీ లేదా ట్రాన్స్ఫారం ఎత్తు పెంచడం గాని చేసి ప్రమాదకర పరిస్థితుల నుండి విద్యార్థులను అలాగే గ్రామ ప్రజలను కాపాడతారని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

