తూర్పుగంగవరంలో పలు ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అధికారులు బుధవారం
అకస్మిక తనిఖీ నిర్వహించారు. విజిలెన్స్ సీఐ ఎన్ రాఘవ రావు, ఎవో కె శివనాగ ప్రసాద్, హెచ్ సీ రవి కుమార్, పీసీ క్రిష్ణలు శ్రీ శ్రీనివాస, శ్రీ సాయి, శ్రీ వరలక్ష్మి, శ్రీ ధన లక్ష్మి ఫెర్టిలైజర్స్ దుకాణాలను తనిఖీ చేసారు. ఆయా దుకాణాలలో రూ.1.06 లక్షల విలువైన అమ్మోనియం నల్పేట్ 5.6 మెట్రిక్ టన్నులు, రూ. 75వేలు విలువైన 20- 20- 0–13 మూడు టన్నులు, రూ.2.05 లక్షల విలువైన 20-20-0-13ను 7.6 టన్నులు అమ్మకాలను నిషేదించారు. ఎరువుల వివరాలు బ్లాక్ బోర్డు నందు నక్రమంగా నమోదు చేయనందున అమ్మకాలను నిలుపుదల చేసినట్లు, యాక్ట్ ప్రకారం అన్ని నిబంధనలు పాటించాలని అప్పటివరకు సెల్స్ నిలుపుదల చేసినట్లు క్వాలిటీ కంట్రోల్ అధికారి బి ప్రసాద రావు తెలిపారు.
