జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, మార్కాపురం, పెద్దారవీడు మండలాల్లో శుక్రవారం
విస్తృతంగా పర్యటించారు.
తొలుత జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, గొట్టిపడియ గ్యాప్ ను సందర్శించి, గొట్టిపడియ గ్యాప్ ఇంటేక్ వద్ద ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత ఆవాసాలకు చేపట్టిన మంచి నీటి సరఫరా పధకం పనులను పరిశీలించి, అధికారుల నుండి వివరాలను అడిగితెలుసుకున్నారు. పశ్చిమ ప్రకాశం ప్రాంత ఆవాసాలకు చేపట్టిన మంచి నీటి సరఫరా పధకం ఆవశ్యకతను, వివరాలను ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్ కు వివరించారు.
అనంతరం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ భాగంగా పెద్దారవీడు మండలం, దేవరాజుగట్టు వద్ద ఏర్పాటుచేసిన ఆర్ అండ్ ఆర్ కాలనీని జిల్లా కలెక్టర్ రాజాబాబు సందర్శించగా, ఆర్ అండ్ ఆర్ కాలనీలో చేపట్టనున్న మౌలిక సదుపాయాల వివరాలను జిల్లా కలెక్టర్ కు అధికారులు వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మార్కాపురం, రాయవరం వద్ద నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి ఎరిక్షన్ బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాల శంకర రావు, వెలిగొండ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

