రూ.50లక్షల విలువైన పల్మనాలజీ పనితీరు పరీక్షల విభాగం ప్రారంభం – నూతన పల్మనాలజీ పరీక్షల ఏర్పాటుతో మరింత ఉపయోగం – జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ మాణిక్యరావు, జీఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్

ఊపిరి తిత్తుల పనితీరు అంచనా వేసి పలు చికిత్సలకు తోడ్పాటు అందించే పల్మనాలజీ పరీక్షలు (పీఎఫిఎస్) జీజీ హెచ్లో ఏర్పాటు చేసుకోవటం అభినందనీయమని జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ మాణిక్యరావు జీఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు. స్థానిక జీజీహెచ్ లో శుక్రవారం రూ. 50 లక్షల విలువైన పీఎఫ్ ఎస్ పరీక్షల పరికరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ మాణిక్యరావు మాట్లాడుతూ… ఈ పరీక్షలలో గాలిలో ఉన్న ఆక్సిజన్ను రక్తంలోనికి అదే విధంగా ఊపిరితిత్తుల లోనికి ఎంత స్థాయిలో గ్రహిస్తున్నామో కూడ పరీక్షిస్తాయని చెప్పారు. వ్యాయాయం ఊపిరితిత్తులపై ప్రభావం, ఊపిరి తిత్తుల మార్గాల్లో తమిడి పోయిన భాగాలను, ఆక్సిజన్ రక్తంలోని అందించే సామర్థ్యం మార్పులను గుర్తించటం, పొగ తాగే అలవాటుతో దాని ప్రభావం అంచనా వేయటం జరగుతుందని చెప్పారు. పర్యావరణ రసాయన ప్రభావం కూడ తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ పరికరాలు రావటానకి సహకరించిన ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడ్మిస్ట్రేటర్ డాక్టర్ కే అద్దయ్య, డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ తిరుపతి రెడ్డి, డాక్టర్ ప్రభాకర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, సీఎస్ఆర్ ఎం డాక్టర్ మాధవి లత, గెనెల్ పల్మనాలజీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ రామస్వామి జనరత్ మెడిసిన్ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పద్మలత, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ దుర్గ ప్రసాద్, డాక్టర్ కుమార వర్మ, అసోషియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రంజిత్ బాష, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *