ఫిర్యాదు దారులతో మర్యాదగా వ్యవహరించాలి – జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు -ఒంగోలులోని పోలీస్ స్టేషను అగస్మిక తనిఖీ నిర్వహించిన ఎస్. పి హర్షవర్ధన్ రాజు

ఒంగోలులోని పలు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించించడమైనది. చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు.పోలీస్ స్టేషన్ లోనే మహిళా సహాయక కేంద్రం, రిసెప్షన్, లాక్ అప్ రూమ్స్ పరిశీలించారు.స్టేషన్ బయట నిలబడిన ఫిర్యాదుదారులతో స్వయంగా.. మాట్లాడి పోలీసుల పని తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్ కు ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వస్తే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. పోలీసు స్టేషన్ కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరిస్తే పోలీసుల పట్ల ప్రజలలో గౌరవం పెరుగుతుందన్నారు.పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడిన వాహనాలను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోర్టు అనుమతితో వాహనాలను డిస్పోజల్ చేసే విధంగా చర్యలు చెపట్టాలని అధికారులను ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.పోలీసు స్టేషన్ యొక్క క్రైమ్ మ్యాప్ లను పరిశీలించారు.పోలీసు స్టేషన్ లోని రికార్డ్స్ పరిశీలించారు. పోలీసు స్టేషన్ లో కేసులు వివరాలు అడిగితెలుసుకున్నారు.పాత కేసుల పై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రత్యేక టీం లను ఎర్పాటు చేసి కేసులను త్వరితగతిన ఛేధించాలని ఆదేశించారు.ఒంగోలు మార్కెట్ ఏరియాలో డ్రోను మరియు సీసీ కెమెరాల నిఘా ఉంచాలన్నారు.అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే ప్రాంతాలను గుర్తించి నిరంతరం డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, అల్లర్లు చేసిన అలాంటి వారిని ఉపేక్షించవద్దన్నారు.లా అండ్ ఆర్డర్ కు విఘాతం కల్గించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ లో సిబ్బంది తో మాట్లాడారు. విధి నిర్వహణ లో అలసత్వం వహిస్తే సహించేదిలేదన్నారు.జిల్లా ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నాగేశ్వరరావు, ఒంగోలు డి.ఎస్.పి ఆర్ శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, తాలూకా ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఒంగోలు రూరల్ సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు మరియు సిబ్బంది ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *