కొత్త పాలెం పొలాల్లో మొక్కజొన్న పంట దగ్ధం రూ.3 లక్షలు విలువైన పంట

కొత్త పాలెం పొలాల్లో గురువారం మొక్కజొన్న పంటకు నిప్పు అంటుకున్నారు. ఆ ప్రాంతంలోని రైతు తమ పొలంలోని వ్యర్ధాలను దగ్ధం చేస్తుండగా ప్రమాదవశాత్తు గాలికి సమీపంలోని మొక్కజొన్న పంటకు నిప్పు అంటుకున్నది. దీంతో రైతులు అన్నవరపు శ్రీనివాస రావుకు చెందిన మూడు ఎకరాలు| , కాటం సుబ్బా రెడ్డి, మేడగం రమణా రెడ్డిలది ఎకరం చొప్పున దగ్ధమైనది. పంట పంట నష్టం విలువ రూ. 3లక్షల వరకు ఉంటుందని రైతులు చెప్పారు. పంట తగలు బడుతున్న సమయంలో దర్శి, అద్దంకి అగ్నిమాపక కేంద్రాలకు ఫొన్లు చేయగా ఆయా అగ్నిమాపక ఇంజన్ ఇతర ప్రమాదాల లో ఉన్నట్లు తెలిసింది. దీంతో రైతులు తెలివిగా తమ ట్రాక్టర్లను తీసుకువచ్చి సమీపంలోని మొక్కజొన్న పంటను రోటో వేటర్తో దున్ని వేయగా మిగిలిన పంటను నిప్పు అంటుకోవటం అగింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయినది. మంట అదుపు కాక పోతే వందల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లేది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *